CITD: సీఐటీడీ డిప్లొమా కోర్సులు 1 d ago
హైదరాబాద్ బాలానగర్‌లోని ఎంఎస్ఎంఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐడీటీ), 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్ టూల్, డై అండ్ మౌల్డ్ మేకింగ్(డీటీడీఎం)-60 , డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (డీఈసీఈ)-60, డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీరింగ్ (డీఏఆర్ఈ)-60, డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ (డీపీఈ)-60 డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. విద్యార్హత పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 19 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ. 1000. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ. 500. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది మే 24. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.